Skip to main content

తొలిసారిగా మహిళా వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపనున్న గల్ఫ్ దేశం?

అంగారకుడిపైకి ఉపగ్రహాన్ని పంపిన మొట్టమొదటి గల్ఫ్‌ దేశంగా రికార్డు సృష్టించిన యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) తాజాగా మరో అడుగు ముందుకు వేసింది.
Current Affairs
మొట్టమొదటిసారిగా మహిళా వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపనున్నట్లు యూఏఈ ప్రధాని షేక్‌ మొహ్మమద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తూమ్‌ తెలిపారు. ఏప్రిల్‌ 10న ఆయన ప్రకటించిన ఇద్దరు వ్యోమగాముల పేర్లలో ఒకరు మహిళ ఉన్నారు. నౌరా అల్‌ మత్రౌషి, మొహమ్మద్‌ అల్‌–ముల్లాను అంతరిక్షంలోకి పంపేందుకు ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు.

జాన్సన్‌ స్పేస్‌ సెంటర్‌ ఎక్కడ ఉంది?
1993లో జన్మించిన మత్రౌషి అబుధాబిలోని నేషనల్‌ పెట్రోలియం కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. అదేవిధంగా అల్‌–ముల్లా ప్రస్తుతం దుబాయ్‌ పోలీస్‌ విభాగంలో పైలట్‌ శిక్షణావిభాగానికి అధిపతిగా ఉన్నారు. వీరిద్దరూ త్వరలో అమెరికాలో టెక్సాస్‌లోని నాసాకు చెందిన జాన్సన్‌ స్పేస్‌ సెంటర్‌లో శిక్షణ పొందనున్నారు.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : తొలిసారిగా మహిళా వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపనున్న గల్ఫ్‌ దేశం?
ఎప్పుడు : ఏప్రిల్‌ 10
ఎవరు : యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)
ఎందుకు : అంతరిక్షంపై మరిన్ని పరిశోధనలు జరిపేందుకు
Published date : 12 Apr 2021 06:26PM

Photo Stories