Skip to main content

తొలి వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకున్న జట్టు?

అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) తొలిసారి నిర్వహించిన వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ)ను న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టు సొంతం చేసుకుంది.
Current Affairs

ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్‌లో జూన్‌ 23న జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌ ఎనిమిది వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. విజేతగా నిలిచిన న్యూజిలాండ్‌కు 16 లక్షల డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 11 కోట్ల 87 లక్షలు)తోపాటు గద (ట్రోఫీ) లభించింది. రన్నరప్‌ భారత జట్టుకు 8 లక్షల డాలర్లు (రూ. 5 కోట్ల 93 లక్షలు) ప్రైజ్‌మనీ దక్కింది. మ్యాచ్‌లో 7 వికెట్లు తీసిన జేమీసన్‌(న్యూజిలాండ్‌) ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు. ఈ పోటీల్లో భారత జట్టుకు విరాట్‌ కోహ్లీ సారథ్యం వహించగా, న్యూజిలాండ్‌ జట్టుకు కేన్‌ విలియమ్సన్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు.


స్కోరు వివరాలు

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 217;
న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 249;
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: మొత్తం (73 ఓవర్లలో ఆలౌట్‌) 170;
న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌: మొత్తం (45.5 ఓవర్లలో 2 వికెట్లకు) 140;

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : తొలి వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకున్న జట్టు?
ఎప్పుడు : జూన్‌ 23
ఎవరు : న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టు
ఎక్కడ : సౌతాంప్టన్, ఇంగ్లండ్‌
ఎందుకు : ఫైనల్లో భారత్‌ క్రికెట్‌ జట్టుపై విజయం సాధించినందున...
Published date : 24 Jun 2021 06:15PM

Photo Stories