Skip to main content

తొలి లోక్‌పాల్‌గా పీసీ ఘోష్ నియామకం

భారతదేశపు తొలి లోక్‌పాల్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పినాకి చంద్ర ఘోష్ (పీసీ ఘోష్) నియమితులయ్యారు.ఈ మేరకు ఘోష్‌తోపాటు మరో ఎనిమిది సభ్యుల నియమకానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మార్చి 19న ఆమోదం తెలిపారు.
ఎనిమిది మంది సభ్యులలో సశస్త్ర సీమా బల్ మాజీ చీఫ్ అర్చనా రామసుందరం, మహారాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి దినేశ్ కుమార్ జైన్, మహేంద్ర సింగ్, ఇంద్రజిత్ ప్రసాద్ గౌతమ్‌లు నాన్ జ్యుడిషియల్ సభ్యులుగా ఉండనున్నారు. జస్టిస్ దిలీప్ బి భోసలే, జస్టిస్ ప్రదీప్ కుమార్ మహంతి, జస్టిస్ అభిలాషా కుమారి, జస్టిస్ అజయ్ కుమార్ త్రిపాఠిలు జ్యుడిషియల్ సభ్యులుగా వ్యవహరించనున్నారు.

ఏమిటీ లోక్‌పాల్?
కేంద్ర స్థాయిలో లోక్‌పాల్‌ను, రాష్ట్ర స్థాయిలో లోకాయుక్త నియామకానికి ఉద్దేశించిన లోక్‌పాల్, లోకాయుక్త చట్టం 2013లో ఆమోదం పొందింది. ప్రధానమంత్రి సహా ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులపై వచ్చే అవినీతి ఆరోపణలపై విచారణ జరపడమే లోక్‌పాల్ ప్రధాన విధి. సాయుధ బలగాలు లోక్‌పాల్ పరిధిలోకి రావు.
  • లోక్‌పాల్ కమిటీలో ఒక ఛైర్మన్, గరిష్ఠంగా 8 మంది సభ్యులు ఉండాలి. వీరిలో నలుగురు జ్యుడిషియల్ సభ్యులై ఉండాలి.
  • లోక్‌పాల్‌లో కనీసం 50 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ, మహిళా విభాగానికి చెందినవారై ఉండాలి.
  • ఛైర్‌పర్సన్, ఇతర సభ్యుల ఐదేళ్లు లేదా 70 ఏళ్లు వయసు వచ్చేవరకూ పదవుల్లో కొనసాగుతారు.
  • ఛైర్మన్ జీత భత్యాలు భారత న్యాయమూర్తి తరహాలోనే ఉంటాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి :
భారతదేశపు తొలి లోక్‌పాల్ నియామకం
ఎప్పుడు : మార్చి 19
ఎవరు : పినాకి చంద్ర ఘోష్ (పీసీ ఘోష్)
Published date : 20 Mar 2019 05:01PM

Photo Stories