Skip to main content

తంజావూరులో సుఖోయ్30 యుద్ధ విమానాలు

హిందూ మహా సముద్ర జలాలపై పట్టు సాధించేందుకు తంజావూరు బేస్ స్టేషన్‌గా భారత వాయు సేన (ఐఏఎఫ్) బ్రహ్మోస్ క్షిపణులను అమర్చిన సుఖోయ్ యుద్ధవిమానాలను ప్రారంభించింది.
Current Affairsటైగర్‌షార్క్ 222 స్క్వాడ్రన్‌కు చెందిన సుఖోయ్30 ఎంకేఐ యుద్ధ విమానాలను తంజావూరు వైమానిక స్థావరంలో చేర్చింది. జనవరి 20న జరిగిన ప్రారంభ కార్యక్రమంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేశ్ కుమార్ సింగ్ భదౌరియా పాల్గొన్నారు.

ఈ సందర్భంగ జనరల్ బిపిన్ రావత్ మాట్లాడుతూ.. భారత్-రష్యాల సంయుక్త కృషితో తయారైన బ్రహ్మోస్ క్షిపణులకు సుఖోయ్‌లు తోడై అత్యంత శక్తిమంతంగా మారాయని చెప్పారు. దక్షిణ భారత్‌లో తంజావూర్ వ్యూహాత్మక స్థావరంగా మారనుందని ఐఏఎఫ్ పేర్కొంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ 300 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను బ్రహ్మోస్ క్షిపణులు సులువుగా టార్గెట్ చేయగలవు. సుఖోయ్ విమానాలు ఒక్కసారి ఇంధనం నింపుకుంటే 1500 కిలోమీటర్ల పరిధిలో నిరంతరాయంగా పనిచేసే సామర్థ్యం వీటి సొంతం.
క్విక్ రివ్యూ :
ఏమిటి :
సుఖోయ్30 ఎంకేఐ యుద్ధ విమానాలు ప్రారంభం
ఎప్పుడు : జనవరి 20
ఎవరు : భారత వాయు సేన (ఐఏఎఫ్)
ఎక్కడ : తంజావూరు, తమిళనాడు
ఎందుకు : హిందూ మహా సముద్ర జలాలపై పట్టు సాధించేందుకు

మాదిరి ప్రశ్నలు

1. భారత వైమానిక దళ దినోత్సవంను ఎప్పుడు నిర్వహిస్తారు?
1. అక్టోబర్ 8
2. నవంబర్ 9
3. డిసెంబర్ 10
4. జనవరి 11

Published date : 21 Jan 2020 06:30PM

Photo Stories