తీవ్ర నిధుల సంక్షోభంలో ఐరాస
Sakshi Education
ఐక్యరాజ్య సమితి తీవ్రమైన నిధుల కొరతలో ఉందని సంస్థ ప్రధాన కార్యదర్శి ఆంటొనియొ గ్యుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఉద్యోగులకు వచ్చే నెల వేతనాలిచ్చేందుకూ సరిపోను నిధులు లేవన్నారు. ఐరాసలో ఈ దశాబ్దంలో ఈ స్థాయి సంక్షోభం ఎన్నడూ లేదన్నారు. సంస్థకు ఇస్తామని ప్రకటించిన నిధులను తక్షణమే అందించాలని 193 సభ్య దేశాలకు అక్టోబర్ 8న విజ్ఞప్తి చేశారు. 2017, 2018 సంవత్సరాలకు గానూ 73 దేశాలు మాత్రమే, మార్చి నాటికి తమ వాటాను పూర్తిగా చెల్లించాయని తెలిపారు. 2018 చివరి నాటికి సభ్య దేశాల నుంచి సంస్థకు అందాల్సిన నిధులు 529 మిలియన్ డాలర్లు.
ఐరాసకు దేశం తరఫున అందించాల్సిన నిధులను పూర్తిగా అందించిన దేశాల్లో భారత్ కూడా ఒకటి. అయితే, శాంతి పరిరక్షణ దళ ఖర్చుల నిమిత్తం భారత్‌కే ఐరాస రూ. 270 కోట్లు ఇవ్వాల్సి ఉంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తీవ్ర నిధుల సంక్షోభంలో ఐక్యరాజ్యసమితి
ఎప్పుడు : అక్టోబర్ 8
ఎవరు : ప్రధాన కార్యదర్శి ఆంటొనియొ గ్యుటెరస్
ఎందుకు : చాలా సభ్యదేశాలు తమవంతు నిధులను అందించనందున

Published date : 10 Oct 2019 06:06PM