Skip to main content

టీఎస్ బీ-పాస్ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం

భవన నిర్మాణ అనుమతులను సరళీకృతం చేయడంతోపాటు పూర్తి పారదర్శకతకు వీలు కల్పించేలా రూపొందించిన ‘తెలంగాణ రాష్ట్ర భవన నిర్మాణ అనుమతులు, ఆమోద స్వీయ ధ్రువీకరణ విధానం(టీఎస్ బీ-పాస్)’ బిల్లుకు తెలంగాణ శాసనసభ సెప్టెంబర్ 14న ఆమోదం తెలిపింది.
Current Affairs

అంతకుముందు పురపాలక మంత్రి కేటీఆర్ బిల్లును సభలో ప్రవేశపెట్టి దాని ప్రత్యేకతలను వివరించారు.

మంత్రి తెలిపిన వివరాల ప్రకారం...

  • టీఎస్ బీ-పాస్‌తో దళారుల పాత్ర లేని పూర్తి పారదర్శక పద్ధతి అందుబాటులోకి రానుంది.
  • ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసిన 21 రోజుల్లోనే అన్ని అనుమతులు వచ్చేస్తాయి. ఏదైనా కారణంతో సకాలంలో అధికారులు అనుమతులు ఇవ్వని పక్షంలో 22వ రోజున అనుమతి వచ్చినట్టుగానే అప్రూవల్ పత్రం వస్తుంది.
  • 75 గజాలలోపు స్థలం అయితే అసలు అనుమతులతో ప్రమేయమే లేదు. ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది. దేశంలో మరే రాష్ట్రంలో ఇలాంటి విధానం అందుబాటులో లేదు... కొన్ని విదేశీ నగరాల్లోనే ఇది అమలులో ఉంది.
  • ఈ చట్టం సరైన విధంగా అమలు జరిగేలా, లోటుపాట్లను గుర్తించేలా జిల్లా కలెక్టర్లు చైర్మన్‌లుగా జిల్లా స్థాయిలో మానిటరింగ్ సెల్‌లు పనిచేస్తాయి.

క్విక్ రివ్యూ :

ఏమిటి : తెలంగాణ రాష్ట్ర భవన నిర్మాణ అనుమతులు, ఆమోద స్వీయ ధ్రువీకరణ విధానం(టీఎస్ బీ-పాస్) బిల్లుకుఆమోదం
ఎప్పుడు : సెప్టెంబర్ 14
ఎవరు : తెలంగాణ శాసనసభ
ఎందుకు : భవన నిర్మాణ అనుమతులను సరళీకృతం చేయడంతోపాటు పూర్తి పారదర్శకతకు వీలు కల్పించేందుకు
Published date : 15 Sep 2020 05:36PM

Photo Stories