Skip to main content

టి20లో ఆస్ట్రేలియా విజయం

భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన టి20లో ఆస్ట్రేలియా విజయం సాధించింది.
కర్నాటక రాజధాని బెంగళూరులో ఫిబ్రవరి 27న జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో ఆసీస్ 7 వికెట్లతో గెలుపొందింది. ఈ విజయంతో భారత్‌పై తొలిసారిగా టి20 సిరీస్‌ను (2-0తో) నెగ్గింది. వరుసగా రెండు ద్వైపాక్షిక టి20 సిరీస్‌లను ఓడిపోవడం భారత్‌కిదే తొలిసారి కాగా, ఈ సిరీస్‌కంటే ముందు న్యూజిలాండ్‌లోనూ భారత్‌కు ఓటమి ఎదురైంది. కోహ్లి కెప్టెన్సీలో భారత జట్టు స్వదేశంలో ఓడిపోయిన తొలి సిరీస్ ఇదే.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన టి20 సిరీస్ విజేత
ఎప్పుడు : ఫిబ్రవరి 27
ఎవరు : ఆస్ట్రేలియా
ఎక్కడ : బెంగళూరు, కర్నాటక
Published date : 28 Feb 2019 05:06PM

Photo Stories