Skip to main content

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సమావేశమయ్యారు.
Current Affairsహైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో జనవరి 13న జరిగిన ఈ భేటీలో రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు, దేశ, స్థానిక రాజకీయ పరిస్థితులపైనా చర్చించారు. ఈ భేటీ వివరాలను ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల కార్యాలయాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. సమావేశంలో ప్రధానంగా గోదావరి జలాలను కృష్ణా ఆయకట్టుకు తరలించే అంశంపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా అన్ని అంశాల్లో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకు సాగాలని ఇద్దరు సీఎంలు నిర్ణయించారు. రాష్ట్ర విభజన చట్టంలోని 9, 10వ షెడ్యూళ్లలో పేర్కొన్న సంస్థల ఆస్తుల విభజనను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని నిర్ణయించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం
ఎప్పుడు : జనవరి 13
ఎవరు : వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కె.చంద్రశేఖరరావు
ఎక్కడ : ప్రగతి భవన్, హైదరాబాద్
ఎందుకు : రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు, దేశ, స్థానిక రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు

మాదిరి ప్రశ్నలు
Published date : 14 Jan 2020 04:12PM

Photo Stories