తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల చర్చలు
Sakshi Education
తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, విభజన అంశాలపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కె.చంద్రశేఖరరావులు విజయవాడలో జూన్ 17న చర్చలు జరిపారు.
విభజన నేపథ్యంలో ఐదేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న 9, 10వ షెడ్యూళ్లలోని 142 సంస్థలకు సంబంధించిన ఆస్తుల పంపకం దగ్గర నుంచి గోదావరి జలాలను గరిష్ట స్థాయిలో వినియోగించుకోవటం వరకూ పలు అంశాలపై ప్రాథమికంగా చర్చించారు. ఈ భేటీ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాలని జగన్‌ను, కేసీఆర్ ఆహ్వానించారు.
ముఖ్యమంత్రుల చర్చలోని అంశాలు..
క్విక్ రివ్యూ :
ఏమిటి : తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల చర్చలు
ఎప్పుడు : జూన్ 17
ఎవరు : వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కె.చంద్రశేఖరరావు
ఎక్కడ : విజయవాడ, ఆంధ్రప్రదేశ్
ముఖ్యమంత్రుల చర్చలోని అంశాలు..
- ఏపీ, తెలంగాణల మధ్య రవాణా సదుపాయాలు పెంచేందుకు చర్యలు తీసుకోవడం
- జాతీయ రహదారుల సంఖ్యను పెంచాలని కేంద్రాన్ని కోరడం
- కృష్ణా జలాల వినియోగంపై రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలను గవర్నర్ నేతృత్వంలో పరిష్కరించుకోవాలని నిర్ణయం
- గోదావరి జలాలను కృష్ణా నదీ పరీవాహక ప్రాంతానికి తరలించడం
- విభజన చట్టంలో రెండు రాష్ట్రాల మధ్య స్పీడ్ రైలు వేస్తామని కేంద్రం హామీ ఇచ్చినా అమలు చేయలేదు. దాంతో పాటు మరిన్ని రైళ్లు వేయాలి. ఇందుకోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలి
- విభజన చట్టంలోని 9, 10 షెడ్యూళ్లలోని ప్రభుత్వరంగ సంస్థల విభజన ప్రక్రియను నెలలోగా పూర్తి చేయడం
- ఆర్టీసీ, రాష్ట్ర ఆర్థిక సంస్థల మధ్య సమస్యలపై సీఎంల స్థాయిలో నిర్ణయం తీసుకోవడం
- విద్యుత్ ఉద్యోగుల విభజన, విద్యుత్ బకాయిల పరిష్కారం త్వరితగతిన చేసేందుకు నిర్ణయం
క్విక్ రివ్యూ :
ఏమిటి : తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల చర్చలు
ఎప్పుడు : జూన్ 17
ఎవరు : వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కె.చంద్రశేఖరరావు
ఎక్కడ : విజయవాడ, ఆంధ్రప్రదేశ్
Published date : 18 Jun 2019 05:25PM