తెలంగాణలో తొలి కోవిడ్ 19 కేసు నమోదు
Sakshi Education
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కోవిడ్ మహమ్మారి తెలంగాణ రాష్ట్రంలోనూ ప్రవేశించింది.
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో తొలి కోవిడ్ 19 కేసు నమోదైంది. దుబాయ్ నుంచి బెంగళూరు ద్వారా నగరానికి వచ్చిన 24 ఏళ్ల ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌కు ఈ వైరస్ సోకినట్టు నిర్ధారణ అరుుంది. అరుుతే ప్రజలు ఎటువంటి భయాందోళనలు చెందొద్దని, ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుందని, వైద్య ఆరోగ్యశాఖ ఇచ్చే సూచనలు, సలహాలను పాటించాలని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. దేశంలో ఢిల్లీ, హైదరాబాద్‌లలో ఒక్కో కోవిడ్ పాజిటివ్ కేసు నమోదైందని మార్చి 2న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తొలి కోవిడ్ 19 కేసు నమోదు
ఎప్పుడు : మార్చి 2
ఎక్కడ : తెలంగాణ
క్విక్ రివ్యూ :
ఏమిటి : తొలి కోవిడ్ 19 కేసు నమోదు
ఎప్పుడు : మార్చి 2
ఎక్కడ : తెలంగాణ
Published date : 03 Mar 2020 05:48PM