Skip to main content

తెలంగాణలో ప్లాస్టిక్‌ నిషేధం

తెలంగాణలో ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్‌ ఉత్పత్తి, విక్రయాలను నిషేధిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు అక్టోబర్‌ 10న ప్రకటించారు.
త్వరలోనే మంత్రివర్గ సమావేశంలో ఈ విషయమై చర్చించి ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. గ్రామాల్లో పచ్చదనం–పరిశుభ్రత పెంపు లక్ష్యంగా నిర్వహించిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ (పల్లె ప్రగతి) అమలు తీరుపై కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో మంత్రులు, కలెక్టర్లు, డీపీఓలు, డీఎల్పీఓలు, ముఖ్య కార్యదర్శులతో సమావేశమయ్యారు. ఈ భేటీలో ప్లాస్టిక్‌పై నిషేధం వంటి పలు నిర్ణయాలను కేసీఆర్‌ ప్రకటించారు.

పల్లె ప్రగతి సమావేశం–సీఎం నిర్ణయాలు
  • గ్రామ పంచాయతీల సిబ్బందికి రూ. 2 లక్షల జీవిత బీమా కల్పిస్తాం.
  • ఏటా మూడుసార్లు పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహిస్తాం.
  • ప్రతి నెలా గ్రామ పంచాయతీలకు రూ. 339 కోట్ల ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం విడుదల చేస్తోంది, ఇది క్రమం తప్పకుండా కొనసాగుతుంది.
  • పల్లె ప్రగతి కార్యక్రమంతో మంచి ఫలితం వచ్చింది. మన ఊరిని మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలనే అవగాహన ప్రజల్లో వచ్చింది.
  • ప్రతి జిల్లా కలెక్టర్‌కు రూ. 2 కోట్ల ప్రత్యేక నిధులు ఇవ్వనున్నాం. ఈ నిధులను కలెక్టర్లు వారి విచక్షణ మేరకు వినియోగించాలి.
  • పల్లె ప్రగతి మాదిరిగానే 20 రోజులపాటు పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించాలి.
  • పచ్చదనం–పరిశుభ్రత పెంచే కార్యక్రమంలో భాగంగా తన ఇంటిని, పరిసరాలను పచ్చగా, శుభ్రంగా ఉంచుకొనే వారి ఇళ్లకు ఉత్తమ గృహం అవార్డు ఇవ్వనున్నాం.

క్విక్‌ రివ్యూ :
ఏమిటి : ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్‌ ఉత్పత్తి, విక్రయాలపై నిషేధం
ఎప్పుడు : అక్టోబర్‌ 10
ఎవరు : తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు
ఎక్కడ : తెలంగాణ
Published date : 11 Oct 2019 06:41PM

Photo Stories