తెలంగాణలో ఎస్‌ఈసీసీ పేరుతో కేంద్రం సర్వే
Sakshi Education
తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణుల జీవన ప్రమాణాలపై కేంద్ర ప్రభుత్వం సర్వే చేయనుంది. పదేళ్లలో మారిన ప్రజల స్థితిగతుల గురించి క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టనుంది.
సామాజిక, ఆర్థిక, కుల గణన (ఎస్‌ఈసీసీ) పేరిట ఇంటింటి సర్వే నిర్వహించనున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ జనవరి 21న వెల్లడించింది. రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ సహకారంతో 2020, ఏప్రిల్ 14 కల్లా ఈ వివరాలను సేకరించాలని నిర్ణయించింది. ఎస్‌ఈసీసీ ద్వారా ప్రజలకు అందుతున్న కనీస సేవలు, ప్రభుత్వ పథకాల అమలు, ఇతరత్రా సామాజిక అంశాలపై సమగ్ర సమాచారం సేకరించనున్నారు.
వివరాల సేకరణకు ప్రత్యేక యాప్..
ప్రజల వివరాలను నమోదు చేసేందుకు కేంద్రప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. గ్రామీణ ప్రజల సమాచారాన్ని నమోదు చేసేందుకు వెళ్లే ఎన్యూమరేటర్లకు యాప్‌తో కూడిన మొబైల్‌ను అందించనుంది.
పథకాల అమలు తీరుపై సమీక్ష..
పదేళ్లకోసారి జనగణన నిర్వహించే కేంద్రం.. అదే సమయంలో దశాబ్ద కాలంలో ప్రజల జీవన ప్రమాణాలు ఏ మేరకు మెరుగయ్యాయి? ప్రభుత్వ పథకాలు లబ్ధిదారుల దరికి చేరుతున్నాయా? అనేది అంచనా వేసేందుకు సామాజిక, ఆర్థిక, కుల గణన నిర్వహిస్తోంది. ఈ డేటా ప్రాతిపదికగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేస్తాయి. పథకాల అమలు తీరును సమీక్షించి కొత్త వాటికి రూపకల్పన చేస్తాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సామాజిక, ఆర్థిక, కుల గణన (ఎస్‌ఈసీసీ) పేరిట ఇంటింటి సర్వే
ఎప్పుడు : జనవరి 21
ఎవరు : కేంద్రప్రభుత్వం
ఎక్కడ : తెలంగాణ
ఎందుకు : పదేళ్లలో మారిన ప్రజల స్థితిగతుల గురించి క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు

Published date : 22 Jan 2020 06:26PM