తెలంగాణలో ఆపద్బంధు పొడిగింపు
Sakshi Education
తెలంగాణలో బాధిత కుటుంబాలకు ఆపన్నహస్తం అందించే ‘ఆపద్బంధు’పథకాన్ని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 10న ఉత్తర్వులు జారీ చేసింది.
దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాలకు వర్తించే ఈ పథకం 2018, నవంబర్ ఒకటో తేదీతో ముగిసింది. అయితే, తాజాగా ఈ పథకాన్ని 2019, నవంబర్ ఒకటి వరకు పొడిగిస్తూ విపత్తుల నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ ఉత్తర్వులు జారీ చేశారు. 17 కేటగిరీల కింద ప్రమాదవశాత్తు చనిపోయిన వారి కుటుంబీకులు ఈ పథకానికి అర్హులు. ఆపద్బంధు కింద రూ.50 వేల సాయాన్ని ప్రభుత్వం అందజేస్తుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆపద్బంధు పథకం పొడిగింపు
ఎప్పుడు : జూన్ 10
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆపద్బంధు పథకం పొడిగింపు
ఎప్పుడు : జూన్ 10
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
Published date : 11 Jun 2019 06:35PM