Skip to main content

తెలంగాణలో ఐసీజేఎస్ సర్వీసు ప్రారంభం

దేశంలోనే తొలిసారిగా చేపట్టిన ఇంటర్ ఆపరేబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ (ఐసీజేఎస్) సర్వీసును తెలంగాణలో ప్రారంభించారు.
తెలంగాణ డీజీపీ కార్యాలయంలో సెప్టెంబర్ 16న తెలంగాణ హెకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ ఐసీజేఎస్‌ను ప్రారంభించారు. ఐసీజేఎస్‌తో న్యాయవిచారణ మరింత వేగవంతమవుతుందని ఈ సందర్భంగా చౌహాన్ అన్నారు.

కరీంనగర్ నుంచి డెమో..
తెలంగాణ పోలీసు శాఖ వరంగల్‌లో పైలట్ ప్రాజెక్టు చేపట్టింది. 2018 డిసెంబర్ 15న జస్టిస్ మదన్ బి.లోకూర్ సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో ఐసీజేఎస్ సేవలను ప్రారంభించారు. ఇది విజయవంతమయ్యాక కరీంనగర్‌ను ఎంచుకున్నారు. సెప్టెంబర్ 16న కరీంనగర్ త్రీటౌన్ నుంచి కమిషనర్ కమలాసన్‌రెడ్డి, హుజూరాబాద్ జేఎఫ్‌సీఎం రాధిక డెమోను వివరించారు. ఐసీజేఎస్ ద్వారా పోలీసు వ్యవస్థలో రియల్‌టైమ్ విధానంలో డేటాబదిలీ జరుగుతుంది. అధికారులు మరింత మెరుగ్గా కేసుల పర్యవేక్షణ చేయగలుగుతారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
తెలంగాణలో ఐసీజేఎస్ సర్వీసు ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 16
ఎవరు : తెలంగాణ హెకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్
Published date : 17 Sep 2019 05:37PM

Photo Stories