Skip to main content

తెలంగాణలో 4 విడతల్లో రుణమాఫీ

వడ్డీతో సహా రూ.లక్ష వరకు ఉన్న వ్యవసాయ పంటల రుణాలను తెలంగాణ ప్రభుత్వం మాఫీ చేయనుంది.
Current Affairsగతంలోలాగే ఈసారి కూడా నాలుగు విడతల్లో రుణమాఫీ అమలు చేయనుంది. వ్యవసాయ రుణమాఫీ పథకం-2018 అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రకటిస్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి మార్చి 17న ఉత్తర్వులు జారీ చేశారు.

కుటుంబం యూనిట్‌గా...
స్వల్పకాలిక పంట రుణాలు, బంగారం తాకట్టుపై గ్రామీణ ప్రాంతాల్లో తీసుకున్న పంట రుణాలకు ప్రభుత్వం రుణమాఫీని వర్తింపజేసింది. కుటుంబం యూనిట్‌గా రుణమాఫీ చేయనున్నారు. దీని ప్రకారం 2014 ఏప్రిల్ 1 నుంచి 2018 డిసెంబర్ 11 వరకు రైతులు తీసుకున్న, రెన్యువల్ చేసుకున్న పంట రుణాలు, వడ్డీలు కలుపుకొని రూ.లక్ష మించకుండా అర్హులైన వారందరికీ రుణమాఫీ వర్తింపజేయనున్నారు. ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల దగ్గర తీసుకున్న వారికి ఇది వర్తించదు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
వ్యవసాయ పంటల రుణాలు నాలుగు విడతల్లో మాఫీ
ఎప్పుడు : మార్చి 17
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
ఎక్కడ : తెలంగాణ
ఎందుకు : రైతుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు
Published date : 18 Mar 2020 06:28PM

Photo Stories