తెలంగాణకు స్వచ్ఛ సర్వేక్షణ్ పురస్కారం
Sakshi Education
మెరుగైన పారిశుద్ధ్య విధానాల అమలు, ఫలితాల సాధనకు గుర్తింపుగా తెలంగాణ రాష్ట్రానికి 2019 ఏడాదికిగానూ స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ అవార్డు లభించింది.
ఢిల్లీలో నవంబర్ 19న జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి సదానందగౌడ చేతుల మీదుగా తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ముఖ్యంగా సర్పంచుల చొరవతోనే ఈ ఘనత సాధ్యమైందన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తెలంగాణకు స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ అవార్డు 2019
ఎప్పుడు : నవంబర్ 19
ఎవరు : కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి సదానందగౌడ
ఎందుకు : మెరుగైన పారిశుద్ధ్య విధానాల అమలు, ఫలితాల సాధనకు గుర్తింపుగా

Published date : 20 Nov 2019 04:37PM