తెలంగాణ రాష్ట్రంలో తొలి రైతు వేదిక ఎక్కడ ప్రారంభమైంది?
Sakshi Education
తెలంగాణ రాష్ట్రంలో తొలి రైతు వేదిక ప్రారంభమైంది. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని కొడకండ్లలో క్లస్టర్ స్థాయిలో నిర్మించిన రైతువేదికను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అక్టోబర్ 31న ప్రారంభించారు.
రైతులను సంఘటితం చేయడం, వారి సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా రూ.600 కోట్లతో 2,601 రైతు వేదికల్ని నిర్మించామని సీఎం తెలిపారు. చైతన్య దీపికలుగా రైతు వేదికలు పనిచేస్తాయని, ఇవి రైతు విప్లవానికి నాంది అవుతాయని చెప్పారు.
రైతు సమ్మేళనం...
రైతు వేదిక ప్రారంభోత్సవం సందర్భంగా ఐదువేల మందితో ఏర్పాటుచేసిన ‘ఆత్మీయ రైతు సమ్మేళనం’ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. రైతులంతా సంఘటితమై సాగులోని లాభనష్టాలు, వాడే పురుగుమందులు, మార్కెట్లో డిమాండ్, పంటను క్రమపద్ధతిలో మార్కెట్‌కు తరలించడం వంటివి రైతువేదికలో చర్చించుకోవాలని సీఎం సూచించారు. వీటిలో రైతుబంధు సమితి సభ్యులు కీలకపాత్ర పోషిస్తారని పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తెలంగాణ రాష్ట్రంలో తొలి రైతు వేదిక ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 31
ఎవరు : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు
ఎక్కడ : కొడకండ్ల, పాలకుర్తి నియోజకవర్గం, జనగామ జిల్లా
ఎందుకు : రైతులను సంఘటితం చేయడం, వారి సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా

Published date : 02 Nov 2020 06:01PM