తెలంగాణ రాష్ట్రానికి తొలిసారిగా మహిళ గవర్నర్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్/చెన్నై: బీజేపీలో ‘సుష్మాజీ ఆఫ్ తమిళనాడు’గా పేరు సంపాదించుకున్న డాక్టర్ తమిళిసై సౌందర్‌రాజన్ తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్‌గా నియమితులయ్యారు.
తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న ఆమెను కేంద్రం రాష్ట్ర గవర్నర్‌గా నియమించింది. ఆమె రాష్ట్రానికి నియమితులైన తొలి మహిళా గవర్నర్ కావడం విశేషం. వైద్య వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చిన తమిళిసై.. అనతి కాలంలోనే అగ్రశ్రేణి మహిళా నేతగా ఎదిగారు. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా నాగర్ కోయిల్‌లో 1961 జూన్ 2వ తేదీన జన్మించారు.
కుటుంబ నేపథ్యం :
తమిళనాడులో ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు కుమరి ఆనందన్, కృష్ణకుమారి దంపతులకు తమిళిసై సౌందర్‌రాజన్ జన్మించారు. తండ్రి ఆనందన్ ఆరుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా, తమిళనాడు పీసీసీ చీఫ్‌గా పని చేశారు. తమిళిసై భర్త డాక్టర్ పి.సౌందర్‌రాజన్ తమిళనాడులో ప్రముఖ వైద్యుడు. రామచంద్ర మెడికల్ కాలేజీలో నెఫ్రాలజీ, కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ విభాగం డిపార్ట్‌మెంట్ హెడ్‌గా ఉన్నారు. సౌందరరాజన్ మద్రాస్ మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఎంజీఆర్ మెడికల్ యూనివర్సిటీలో గైనకాలజీలో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆమె కెనడాలో సానోలజీ, ఫీటల్ థెరపీలో ప్రత్యేక శిక్షణ పొందారు. రామచంద్ర మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఐదేళ్లు పనిచేశారు.
చిన్నతనం నుంచే రాజకీయాలపై ఆసక్తి :
ఆమె తండ్రి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కావడంతో చిన్నతనం నుంచే తమిళిసై రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నారు. అయితే తన తండ్రి బాటలో కాంగ్రెస్ వైపు కాకుండా ఆరెస్సెస్, బీజేపీ సిద్ధాంతాలపై ఆసక్తి పెంచుకున్నారు. మద్రాస్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేస్తున్న సమయంలోనే విద్యార్థి సంఘం నాయకురాలిగా ఎన్నికయ్యారు. ఆ తరువాత బీజేపీలో పూర్తిస్థాయి కార్యకర్తగా చేరి ఆనేక హోదాల్లో పార్టీకి సేవలందించారు.
సౌందరరాజన్ రాజకీయ ప్రస్థానం..
క్విక్ రివ్యూ:
ఏమిటి: తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళ గవర్నర్‌గా డాక్టర్ తమిళిసై సౌందర్‌రాజన్ నియమాకం
ఎప్పుడు: సెప్టెంబర్ 1, 2019
ఎవరు: డాక్టర్ తమిళిసై సౌందర్‌రాజన్
ఎక్కడ: తెలంగాణ

- ఆరెస్సెస్, బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితులరాలైన ఆమె సౌత్ చెన్నై డిస్ట్రిక్ట్ మెడికల్ వింగ్ సెక్రటరీగా 19990-2001 మధ్య పని చేశారు.
- 2001-2004 వరకు స్టేట్ మెడికల్ వింగ్ జనరల్ సెక్రటరీ.
- 2004-2005 వరకు మూడు జిల్లాల జోనల్ ఇన్‌ఛార్జిగా ఉన్నారు.
- 2005-2007 వరకు సదరన్ స్టేట్స్ మెడికల్ వింగ్ ఆల్ ఇండియా కో-కన్వీనర్.
- 2007-2010 వరకు తమిళనాడు రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి.
- 2010-2013 వరకు రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షురాలు.
- 2013నుంచి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు.
- 2014 ఆగస్టు 16 నుంచి తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళ గవర్నర్‌గా డాక్టర్ తమిళిసై సౌందర్‌రాజన్ నియమాకం
ఎప్పుడు: సెప్టెంబర్ 1, 2019
ఎవరు: డాక్టర్ తమిళిసై సౌందర్‌రాజన్
ఎక్కడ: తెలంగాణ
Published date : 03 Sep 2019 06:32PM