తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకున్న గ్రామం?
Sakshi Education
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దత్తత తీసుకున్నారు.
ఎర్రవల్లి తరహాలో వాసాలమర్రిని కూడా అభివృద్ధి చేస్తానని నవంబర్ 1న సీఎం ప్రకటించారు. రూ.100 కోట్లు ఖర్చయినా గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు. వాసాలమర్రిని ఎర్రవల్లి తరహాలో అభివృద్ధి చేయాలని, గ్రామానికి ఏమేం కావాలనే అంశాలపై బ్లూ ప్రింట్ తయారు చేయాలని జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్‌ని ఆదేశించారు.
హెచ్‌ఎఫ్‌ఐ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన తెలుగు వ్యక్తి?
భారత హ్యాండ్ బాల్ సమాఖ్య (హెచ్‌ఎఫ్‌ఐ) నూతన అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎ. జగన్మోహన్ రావు ఎన్నికయ్యారు. అధ్యక్ష పదవి కోసం జరిగిన ఎన్నికల్లో ఆయన ఏకగ్రీవంగా విజయం సాధించారు. సమాఖ్యకు సీనియర్ ఉపాధ్యక్షులుగా ఆనందీశ్వర్ పాండే, ప్రదీప్ కుమార్ వ్యవహరించనున్నారు.

Published date : 02 Nov 2020 06:04PM