తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా విజయ్‌సేన్‌రెడ్డి
Sakshi Education
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బి.విజయ్‌సేన్‌రెడ్డిని నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రప్రభుత్వానికి ఏప్రిల్ 20న సిఫారసు చేసింది.
న్యాయవాదుల కోటా నుంచి ఆయన పేరును రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్రానికి పంపింది. హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న విజయసేన్‌రెడ్డి 1970 ఆగస్టు 22న హైదరాబాద్‌లో జన్మించారు. పడాల రామిరెడ్డి లా కాలేజీలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి 1994 డిసెంబర్ 28న న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. ఆయన తండ్రి జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డి.. ఉమ్మడి ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. తర్వాత మద్రాస్, కేరళ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తిగా చేసి 2005 మార్చి 2న పదవీ విరమణ చేశారు.
విజయ్‌సేన్‌రెడ్డి నియామకానికి కేంద్రం సమ్మతి తెలిపి రాష్ట్రపతికి పంపాలి. రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన తర్వాత న్యాయమూర్తిగా నియమితులవుతారు. ప్రస్తుతం హైకోర్టులో 24 మంది న్యాయమూర్తుల పోస్టులకు గాను ప్రధాన న్యాయమూర్తితో కలిపి 12 మంది ఉన్నారు. విజయ్‌సేన్‌రెడ్డి నియామకం అయితే ఇంకా 11 పోస్టులు ఖాళీగా ఉంటాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా విజయ్‌సేన్‌రెడ్డి
ఎప్పుడు : ప్రిల్ 20
ఎవరు : సుప్రీంకోర్టు కొలీజియం
క్విక్ రివ్యూ :
ఏమిటి : తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా విజయ్‌సేన్‌రెడ్డి
ఎప్పుడు : ప్రిల్ 20
ఎవరు : సుప్రీంకోర్టు కొలీజియం
Published date : 21 Apr 2020 06:30PM