Skip to main content

తెలంగాణ దళిత బంధు పథకం ఎక్కడ ప్రారంభమైంది?

దళితుల సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘తెలంగాణ దళిత బంధు’ పథకం ప్రారంభమైంది.

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని శాలపల్లి వేదికగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుఆగస్టు 16న దళితబంధు పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ... ‘‘రాష్ట్రంలో దళితుల సామాజిక ఆర్థిక స్థితిగతులు మార్చేందుకు.. వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకేదళితబంధుపథకాన్ని ప్రవేశపెడుతున్నాం.హుజూరాబాద్‌లో పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించిన ఈ పథకాన్ని రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లోనూ అమలు చేసి తీరుతాం. హుజూరాబాద్‌ ఒక ప్రయోగశాల. గతంలో ఇక్కడే రైతు బంధును ప్రారంభించాం. ఇప్పుడు అదే సెంటిమెంటుతో దళిత బంధును ప్రారంభిస్తున్నాం. దీనిని నూటికి నూరుపాళ్లు విజయవంతం చేసితీరుతాం’’ అని పేర్కొన్నారు.

పథకం ఉద్దేశం...
కుటుంబం యూనిట్‌గా అర్హులైన దళిత కుటుంబాలకు నేరుగా ఆర్థికసాయం చేసి, వారికి ఇష్టమైన పనిని ఎంచుకుని, అభివృద్ధి చెందే అవకాశాన్ని కల్పించాలన్న ఉద్దేశంతో దళిత బంధు పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దళారుల బాధలేకుండా.. నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ. 10 లక్షల ఆర్థిక సాయాన్ని జమ చేస్తారు.

క్విక్‌ రివ్యూ
:
ఏమిటి : తెలంగాణ దళిత బంధు పథకం ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు 16
ఎవరు : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు
ఎక్కడ : శాలపల్లి, హుజూరాబాద్‌ నియోజకవర్గం, కరీంనగర్‌ జిల్లా
ఎందుకు : రాష్ట్రంలోని దళితుల సాధికారత కోసం...
Published date : 17 Aug 2021 04:07PM

Photo Stories