Skip to main content

తెలంగాణ అటవీ సంస్థ చైర్మన్‌గా ప్రతాప్‌రెడ్డి

తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ నూతన చైర్మన్‌గా టీఆర్‌ఎస్ నేత వంటేరు ప్రతాప్‌రెడ్డి నియమితులయ్యారు.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి అక్టోబర్ 23న ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రెండేళ్ల పాటు ప్రతాప్‌రెడ్డి ఈ పదవిలో కొనసాగనున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బూరుగుపల్లికి చెందిన ప్రతాప్‌రెడ్డి సుదీర్ఘంగా గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయాల్లో కీలక నేతగా ఉన్నారు. 2019 ఏడాది జనవరిలో కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ నూతన చైర్మన్‌గా నియామకం
ఎప్పుడు : అక్టోబర్ 23
ఎవరు : వంటేరు ప్రతాప్‌రెడ్డి
Published date : 24 Oct 2019 05:32PM

Photo Stories