Skip to main content

తెలంగాణ ఆర్చరీ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి?

తెలంగాణ ఆర్చరీ సంఘం (టీఏఎస్) అధ్యక్షుడిగా అనిల్ కామినేని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Current Affairs
సెప్టెంబర్ 27న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం ఆవరణలోని ఒలింపిక్ భవన్‌లో ఎన్నికలు నిర్వహించారు. ఆలిండియా ఆర్చరీ సంఘం ప్రధాన కార్యదర్శి ప్రమోద్ చందూర్కర్, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ప్రేమ్‌రాజ్ సమక్షంలో ఎన్నికలు నిర్వహించారు. ఉపాధ్యక్షులుగా రాజు (మెదక్), ప్రధాన కార్యదర్శిగా సంజీవ రెడ్డి (నిజామాబాద్), కోశాధికారిగా పుట్టా శంకరయ్య (ఖమ్మం), సంయుక్త కార్యదర్శిగా కె.శ్రీనివాస్‌లతో పాటు మరో ఏడుగురు ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా ఎన్నికయ్యారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : తెలంగాణ ఆర్చరీ సంఘం (టీఏఎస్) అధ్యక్షుడిగా ఎన్నిక
ఎప్పుడు : సెప్టెంబర్ 27
ఎవరు : అనిల్ కామినేని
Published date : 29 Sep 2020 01:25PM

Photo Stories