తెలంగాణ ఐటీ మంత్రితో లక్సెంబర్గ్ రాయబారి భేటీ
Sakshi Education
తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావుతో వివిధ విదేశీ ప్రతినిధి బృందాలు భేటీ అయ్యాయి.
హైదరాబాద్‌లో సెప్టెంబర్ 19న జరిగిన వేర్వేరు సమావేశాల్లో భారత్‌లో దక్షిణాఫ్రికా హైకమిషనర్, లక్సెంబర్గ్ రాయబారితో పాటు ఫ్రెంచ్ కాన్సుల్ జనరల్‌తోనూ కేటీఆర్ భేటీ అయ్యారు. తొలుత భారత్‌లో దక్షిణాఫ్రికా హైకమిషనర్ సిబుసిసో ఎన్డెబెలో నేతృత్వంలోని బృందంతో కేటీఆర్ చర్చలు జరిపారు. దక్షిణాఫ్రికాకు చెందిన పలు కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని, ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో పెట్టుబడులకున్న అవకాశాలను పరిశీలించేందుకు పర్యటిస్తున్నట్లు హైకమిషనర్ తెలిపారు.
భారతదేశంలో లక్సంబెర్గ్ రాయబారి జీన్ క్లాడ్ కుగెనర్ కూడా కేటీఆర్‌తో సమావేశమయ్యారు. ఫిన్‌టెక్, ఏరోస్పేస్, ఆటోమొబైల్ రంగాల్లో పెట్టబడులకు సంబంధించి తెలంగాణతో కలిసి పనిచేస్తామని కుగెనర్ అన్నారు. అనంతరం ఫ్రెంచ్ కాన్సుల్ జనరల్ మార్జరీ వాన్ బేలిగమ్ కేటీఆర్‌తో సమావేశమయ్యారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావుతో భేటీ
ఎప్పుడు : సెప్టెంబర్ 19
ఎవరు : భారత్‌లో దక్షిణాఫ్రికా హైకమిషనర్, లక్సెంబర్గ్ రాయబారితో పాటు ఫ్రెంచ్ కాన్సుల్ జనరల్
ఎక్కడ : హైదరాబాద్

Published date : 20 Sep 2019 05:32PM