Skip to main content

టెక్సాస్‌తో వర్సిటీతో టిటా భాగస్వామ్యం

ఆన్ లైన్ వేదికగా జరుగుతున్న సైబర్‌ మోసాలను అరికట్టేందుకు తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టిటా) నడుం బిగించింది.
Current Affairs డల్లాస్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ (యూటీడీ) సాయంతో, ‘డిజిథాన్’భాగస్వామ్యంతో ‘సైబర్‌ రెడీ ప్రోగ్రామ్‌’పేరిట సైబర్‌ సెక్యూరిటీపై నెల రోజుల పాటు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. సైబర్‌ సెక్యూరిటీ, డిజిటల్‌ ఆస్తులను కాపాడే లక్ష్యంతో 2022 నాటికి 10 వేల మందికి శిక్షణ ఇవ్వాలని టిటా లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ శిక్షణ పొందిన వారికి అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సర్టిఫికెట్‌ను యూటీడీ, డిజిథాన్టిటా వెల్లడించింది.

ఓజోనిట్‌ ఆవిష్కరణ
కరోనా వైరస్‌ నివారణ, నియంత్రణ కోసం వరంగల్‌ నేషనల్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(నిట్‌) అధ్యాపకులు ‘ఓజోనిట్‌’అనే నూతన పరికరాన్ని ఆవిష్కరించారు. నిట్‌ వరంగల్‌ ఫిజిక్స్‌ విభాగాధిపతిడి.దినకర్‌ సారథ్యంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ డి.హరనాథ్, పీహెచ్‌డీ స్కాలర్‌ పి.చందర్‌రావు సంయుక్తంగా ఈ ఓజోనిట్‌ పరికరాన్ని ఆవిష్కరించారు. మల్టిపుల్ స్టెరిలైజేషన్ గా రూపొందించిన ఈ పరికరం ఇళ్లలో ఉపయోగించే ఫ్రిజ్‌ మాదిరిగా ఉంటుంది. ఈ పరికరం దానిలో ఉంచిన వస్తువులపై ఉన్న వైరస్, ఫంగస్, బ్యాక్టీరియాలను అరగంటలో హతం చేస్తుంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
డల్లాస్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ (యూటీడీ) భాగస్యామ్యం
ఎప్పుడు : జూలై 31
ఎవరు : తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టిటా)
ఎందుకు : సైబర్‌ సెక్యూరిటీ, డిజిటల్‌ ఆస్తులను కాపాడే లక్ష్యంతో 2022 నాటికి 10 వేల మందికి శిక్షణ ఇవ్వాలని
Published date : 02 Aug 2020 11:02AM

Photo Stories