Skip to main content

తేజస్ అరెస్టెడ్ ల్యాండింగ్ విజయవంతం

పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ విమానం ‘తేజస్’కు సంబంధించి అరెస్టెడ్ ల్యాండింగ్ పరీక్ష(నౌకాదళ వెర్షన్) విజయవంతమైంది.
గోవాలోని ఓ నావికా కేంద్రంలో సెప్టెంబర్ 13న ఈ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు. నౌకాదళంలోని విమాన వాహకనౌక ఐఎన్‌ఎస్ విక్రమాదిత్యపై తొలిసారిగా తేజస్ దిగింది. దీంతో అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనాల తరువాత ఈ తరహా సామర్థ్యమున్న దేశంగా భారత్ నిలిచింది. డీఆర్‌డీవో, ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ తేజస్ యుద్ధ విమానాన్ని అభివృద్ధి చేశాయి.

అతి తక్కువ స్థలం మాత్రమే ఉండే విమాన వాహక నౌకలపై సమర్థవంతంగా దిగేందుకు అరెస్టెడ్ ల్యాండింగ్ ప్రక్రియను ఉపయోగిస్తారు. విమానం ముందుభాగంలో ఉన్న కొక్కెం ల్యాండింగ్ సమయంలో డెక్‌పై ఉన్న ఓ తీగను అందుకోవడం ద్వారా వేగాన్ని నియంత్రించుకుంటుంది. తద్వారా తక్కువ పొడవున్న విమాన వాహక యుద్ధ నౌక రన్‌వేపై సులువుగా ల్యాండ్ అవుతుంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
తేజస్ అరెస్టెడ్ ల్యాండింగ్ విజయవంతం
ఎప్పుడు : సెప్టెంబర్ 13
ఎక్కడ : గోవా తీరం
Published date : 14 Sep 2019 05:33PM

Photo Stories