Skip to main content

తేజ్‌గామ్‌ ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్ని ప్రమాదం

పాకిస్తాన్‌లోని కరాచీ, రావల్పిండి మధ్య నడిచే తేజ్‌గామ్‌ ఎక్స్‌ప్రెస్‌లో అక్టోబర్ 31న భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
కరాచీ నుంచి రావల్పిండి వెళ్తున్న తేజ్‌గామ్‌ ఎక్స్‌ప్రెస్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. పంజాబ్ ప్రావిన్స్ లోని రహీమ్ యార్ ఖాన్ పట్టణానికి సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 73 మంది మృతి చెందినట్లు పాకిస్తాన్ అధికారులు తెలిపారు. 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం సమయంలో బోగీల్లో 200 మందికి పైగా ప్రయాణికులున్నారు. వంట చేసుకునేందుకు ఉపయోగించే గ్యాస్ సిలిండర్ పేలడంతోనే ఈ ప్రమాదం సంభవించిందని పాకిస్తాన్ మీడియా చెబుతోంది.
 
క్విక్‌ రివ్యూ :
ఏమిటి : తేజ్‌గామ్‌ ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్ని ప్రమాదం
ఎప్పుడు : అక్టోబర్‌ 31
ఎక్కడ : రహీమ్‌ యార్‌ ఖాన్‌ పట్టణం, పంజాబ్‌ ప్రావిన్స్, పాకిస్తాన్‌
ఎందుకు : వంట గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో
Published date : 31 Oct 2019 06:16PM

Photo Stories