Skip to main content

తదుపరి ఆర్మీ చీఫ్‌గా మనోజ్ ముకుంద్

భారత సైనిక దళ ప్రధానాధికారి(చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్)గా జనరల్ మనోజ్ ముకుంద్ నరవానే నియమితులు కానున్నారు.
Current Affairsప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ 2019, డిసెంబర్ 31న పదవీ విరమణ పొందనున్నారు. సంప్రదాయం ప్రకారం ఆయన తర్వాత అత్యంత సీనియర్ అయిన మనోజ్ ఆర్మీ చీఫ్‌గా నియమితులుకానున్నారు. ప్రస్తుతం ఆర్మీ వైస్ చీఫ్‌గా మనోజ్ పనిచేస్తున్నారు.

నేషనల్ డిఫెన్స్ అకాడెమీ, ఇండియన్ మిలిటరీ అకాడెమీ పూర్వ విద్యార్థి అయిన మనోజ్ వైస్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించడానికి ముందు చైనాతో సరిహద్దు పంచుకుంటున్న ప్రాంతాల వద్ద పనిచేస్తున్న ఈస్ట్రన్ కమాండ్‌ను నడిపించారు. 37 ఏళ్ల తన సర్వీసులో సమస్యాత్మక ప్రాంతాలైన జమ్మూకశ్మీర్ వంటి చోట్ల పనిచేశారు. జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రీయ రైఫిల్స్ బెటాలియన్‌కు నాయకత్వం వహించారు. మూడేళ్ల పాటు మయన్మార్‌లో ఉండి భారత ఎంబసీతో కలసి పని చేశారు. గతంలో ‘విశిష్ట సేవా అవార్డ్’తో పాటు ‘అతి విశిష్ట సేవా మెడల్’ను మనోజ్ అందుకున్నారు. తన బెటాలియన్‌ను జమ్మూకశ్మీర్‌లో చక్కగా నడిపించినందుకు సేనా మెడల్ కూడా అందుకున్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
తదుపరి ఆర్మీ చీఫ్‌గా నియామకం
ఎప్పుడు : డిసెంబర్ 16
ఎవరు : జనరల్ మనోజ్ ముకుంద్ నరవానే
Published date : 17 Dec 2019 05:49PM

Photo Stories