తాత్కాలిక సీవీసీగా శరద్ కుమార్
Sakshi Education
తాత్కాలిక కేంద్ర విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ)గా శరద్ కుమార్‌ను నియమిస్తూ జూన్ 11న కేంద్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇప్పటివరకు సీవీసీగా ఉన్న కె.వి.చౌదరి పదవీ కాలం జూన్ 9న ముగిసింది. దీంతో విజిలెన్స్ కమిషనర్ (వీసీ) శరద్ కుమార్‌ను ప్రభుత్వం తాత్కాలిక సీవీసీగా నియమించింది. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఎ) మాజీ అధిపతి అయిన శరద్ కుమార్ 2018, జూన్ 12న విజిలెన్స్ కమిషనర్‌గా నియమితులయ్యారు. కేంద్ర విజిలెన్స్ కమిషన్‌లో మరో కమిషనర్ అయిన టి.ఎం.భాసిన్ పదవీ కాలం జూన్ 10న ముగిసింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తాత్కాలిక కేంద్ర విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ) నియామకం
ఎప్పుడు : జూన్ 11
ఎవరు : శరద్ కుమార్
క్విక్ రివ్యూ :
ఏమిటి : తాత్కాలిక కేంద్ర విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ) నియామకం
ఎప్పుడు : జూన్ 11
ఎవరు : శరద్ కుమార్
Published date : 12 Jun 2019 06:28PM