Skip to main content

తాల్కటోరా స్టేడియంలో పరీక్షా పే చర్చా

న్యూఢిల్లీలోని తాల్కటోరా స్టేడియంలో జనవరి 20న ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ... విద్యార్థులకు పరీక్షలే ప్రధానం కాదనీ, తమ ఆసక్తులను బట్టి విద్యార్థులు ఎదగాలనీ, సాంకేతికతకు బానిసలు కారాదనీ పేర్కొన్నారు.
Current Affairsకార్యక్రమానికి దేశవ్యాప్తంగా హాజరైన విద్యార్థులకు ఆయన కొన్ని సూచనలు చేశారు. పరీక్ష హాలులోకి ప్రవేశించేటప్పుడు ఒత్తిడిని విడనాడాలనీ, ఆత్మ విశ్వాసంతో ఉండి నేర్చుకున్న విషయాలపై దృష్టిసారించాలని ఉద్బోధించారు. పరీక్షల సమయంలో ఒత్తిడి నుంచి ఎలా బయటపడాలో, పరీక్షల్లో సమయపాలనకు ఏం చేయాలో కొన్ని చిట్కాలు చెప్పారు. క్రికెట్ నుంచి మొదలుకొని, చంద్రయాన్ -2 ప్రయోగం వరకు స్వీయ అనుభవాల నుంచి నేర్చుకోవాల్సిన గుణపాఠాలను ప్రస్తావించారు. దాదాపు 2,000 మంది విద్యార్థులు, అధ్యాపకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి :
పరీక్షా పే చర్చా కార్యక్రమం
ఎప్పుడు : జనవరి 20
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : తాల్కటోరా స్టేడియం, న్యూఢిల్లీ
ఎందుకు : పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడి నుంచి ఎలా బయటపడాలో తెలిపేందుకు
మాదిరి ప్రశ్నలు

1. విద్యారులు పరీక్షలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ రచించిన పుస్తకం?
1. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్
2. త్రీ ఐడియాస్ ఫర్ ఎగ్జామ్స్
3. ఎగ్జామ్ వారియర్స్
4. ఎగ్జామ్స్ విత్ అవుట్ ఫియర్

Published date : 21 Jan 2020 06:27PM

Photo Stories