Skip to main content

తాజా గణాంకాల ప్రకారం.... స్విస్ బ్యాంకుల్లో భారతీయుల సంపద?

భారత్ కేంద్రంగా పనిచేస్తున్న బ్రాంచీలు, ఇతర ఫైనాన్షియల్ సంస్థల ద్వారా భారతీయులు, భారత్ కంపెనీలు స్విస్ బ్యాంకుల్లో ఉంచిన నిధుల గణాంకాలను స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంక్ జూన్ 17న విడుదల చేసింది.
Current Affairs

ఈ గణాంకాల ప్రకారం...

  • భారతీయలు, భారత కంపెనీల స్విస్‌ బ్యాంకుల్లో 2020 చివరికి వార్షికంగా మూడు రెట్లు పెరిగి 2.55 బిలియన్‌ స్విస్‌ ఫ్రాంక్స్‌కు (దాదాపు రూ.20,700 కోట్లు) చేరింది.
  • 2019 ముగిసే నాటికి ఈ విలువ 899 మిలియన్ల స్విస్‌ ఫ్రాంక్స్‌ (దాదాపు రూ.6,625 కోట్లు).
  • రెండు సంవత్సరాల దిగువముఖం తరువాత 2020లో తిరిగి ఇండియన్‌ క్లైంట్స్‌ నిధులు ఏకంగా 13 సంవత్సరాల గరిష్టానికి చేరాయి. బాండ్లు, తత్సంబంధ ఇన్‌స్ట్రుమెంట్లలో (పథకాలు) ఉంచిన సంపద భారీగా పెరగడం దీనికి కారణం.
  • n 2020లో కస్టమర్‌ అకౌంట్‌ డిపాజిట్లు 503.9 మిలియన్‌ స్విస్‌ ఫ్రాంక్స్‌ (రూ.4,000 కోట్లు). 2019లో ఈ మొత్తం 550 మిలియన్‌ ఫ్రాంక్స్‌.
  • 2006లో స్విస్‌ బ్యాంకుల్లో భారతీయులు, భారత కంపెనీల నిధులు 6.5 బిలియన్‌ డాలర్లు.

తొలి రెండు స్థానాల్లో బ్రిటన్, అమెరికా

అన్ని స్విస్‌ బ్యాంకుల్లో కస్టమర్ల డిపాజిట్లు 2020లో దాదాపు 2 ట్రిలియన్‌ స్విస్‌ ఫ్రాంక్స్‌లకు చేరాయి. ఇందులో 600 బిలియన్‌ డాలర్లు ఫారన్‌ కస్టమర్‌ డిపాజిట్లు. 377 బిలియన్‌ స్విస్‌ ఫ్రాంక్స్‌తో బ్రిటన్‌ ముందు నిలిచింది. ఇందుకు సంబంధించి 152 బిలియన్లలో అమెరికా రెండవ స్థానంలో నిలిచింది. 100 బిలియన్‌ ఫ్రాంక్స్‌ పైన నిలిచిన దేశాలు ఈ రెండే. గణాంకాల ప్రకారం, 2020 చివరినాటికి స్విట్జర్లాండ్‌లో 243 బ్యాంకులు పనిచేస్తున్నాయి.
Published date : 18 Jun 2021 06:18PM

Photo Stories