Sumit Antil: పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన భారత జావెలిన్ త్రోయర్?
Sakshi Education
టోక్యో పారాలింపిక్స్–2020లో భారత జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్ స్వర్ణ పతకం సాధించాడు.
టోక్యోలో 2021, ఆగస్టు 30న జరిగిన పురుషుల జావెలిన్ త్రో ఎఫ్–64 కేటగిరిలో పాల్గొన్న 23 ఏళ్ల సుమిత్(హరియాణా) బల్లెంను 68.55 మీటర్ల దూరం విసిరి బంగారు పతకాన్ని గెల్చుకున్నాడు. ఈ క్రమంలో నూతన ప్రపంచ రికార్డును సుమిత్ నెలకొల్పాడు. మైకేల్ బురియన్ (ఆస్ట్రేలియా–66.29 మీటర్లు) రజతం... దులాన్ కొడితువాకు (శ్రీలంక–65.61 మీటర్లు) కాంస్యం సాధించారు. భారత్‌కే చెందిన సందీప్ చౌదరీ 62.20 మీటర్లతో నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
నాలుగో భారత క్రీడాకారుడు...
పారాలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన నాలుగో భారత క్రీడాకారుడు సుమిత్. గతంలో మురళీకాంత్ పేట్కర్ (స్విమ్మింగ్; 1972 హెడెల్‌బర్గ్–జర్మనీ), దేవేంద్ర ఝఝారియా (అథ్లెటిక్స్; 2004 ఏథెన్స్, 2016 రియో), మరియప్పన్ తంగవేలు (అథ్లెటిక్స్; 2016 రియో) పసిడి పతకాలు నెగ్గారు.
సుమిత్‌కు రూ. 6 కోట్లు నజరానా...
పారాలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గిన తమ రాష్ట్ర జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్‌కు రూ. 6 కోట్లు... రజత పతకం గెలిచిన డిస్కస్ త్రోయర్ యోగేశ్‌కు రూ. 4 కోట్లు నగదు పురస్కారం అందిస్తామని హరియాణా ప్రభుత్వం తెలిపింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : టోక్యో పారాలింపిక్స్–2020 పురుషుల జావెలిన్ త్రో ఎఫ్–64 కేటగిరిలో స్వర్ణ పతకం సాధించిన క్రీడాకారుడు?
ఎప్పుడు : ఆగస్టు 30
ఎవరు : సుమిత్ అంటిల్
ఎక్కడ : టోక్యో, జపాన్

Published date : 31 Aug 2021 06:11PM