Skip to main content

State BC Commission: రాష్ట్ర బీసీ కమిషన్‌ చైర్మన్‌గా నియమితులైన అధికారి?

తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్‌(Telangana BC Commission) చైర్మన్‌గా డాక్టర్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.
కమిషన్‌కు సభ్య కార్యదర్శిగా బీసీ సంక్షేమ శాఖ కమిషనర్‌ వ్యవహరించనుండగా.. కమిషన్‌ సభ్యులుగా సీహెచ్‌. ఉపేంద్ర, శుభప్రద్‌పటేల్, కె.కిషోర్‌ గౌడ్‌లు ఉంటారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఆగస్టు 23న నోటిఫికేషన్‌ జారీ చేశారు. రాష్ట్ర అవతరణ తర్వాత తొలి బీసీ కమిషన్‌లో సభ్యులుగా వకుళాభరణం సేవలందించిన సంగతి తెలిసిందే.
 
గవర్నర్కార్యదర్శిగా సిసోడియా...
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌(Biswabhusan Harichandan) ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆర్‌.పి.సిసోడియా ఆగస్టు 23న బాధ్యతలు స్వీకరించారు. 1991 బ్యాచ్‌కు చెందిన ఆయన కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌గా ఉంటూ ఇటీవల గవర్నర్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ అయ్యారు.

మీనా బాధ్యతల స్వీకరణ...
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ (ఆహారశుద్ధి) కార్యదర్శిగా ముఖేష్‌ కుమార్‌ మీనా ఆగస్టు 23న రాష్ట్ర సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ... రానున్న రెండేళ్లలో ప్రతీ పార్లమెంటు నియోజకవర్గానికో ఆహారశుద్ధి పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసిందన్నారు.

డీఆర్ఐ కమిషనర్గా రాజేశ్వర...
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (ఏపీడీఆర్‌ఐ) ప్రత్యేక కమిషనర్‌గా సి.హెచ్‌.రాజేశ్వరరెడ్డి ఆగస్టు 23న బాధ్యతలు స్వీకరించారు. ఇంతవరకు డీఆర్‌ఐ కమిషనర్‌గా ఉన్న సాధు నరసింహారెడ్డి కేంద్ర సర్వీసులకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ప్రత్యేక కమిషనర్‌గా రాజేశ్వరరెడ్డి నియమితులయ్యారు.

క్విక్రివ్యూ :
ఏమిటి : తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్‌ చైర్మన్‌గా నియామకం
ఎప్పుడు : ఆగస్టు 23
ఎవరు : డాక్టర్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌

Published date : 24 Aug 2021 06:08PM

Photo Stories