Skip to main content

Startups: స్టార్టప్‌ల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం ఏది?

దేశీయంగా 300 పైచిలుకు ఐటీ స్టార్టప్‌లకు తోడ్పాటు అందించేందుకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ (మెయిటీ) తాజాగా కొత్త కార్యక్రమం ప్రారంభించింది.
స్టార్టప్‌ యాక్సెలరేటర్‌ ఆఫ్‌ మెయిటీ ఫర్‌ ప్రోడక్ట్‌ ఇన్నోవేషన్, డెవలప్‌మెంట్‌ అండ్‌ గ్రోత్‌ (సమృధ్‌) పేరిట ఆగస్టు 25న దీన్ని ఆవిష్కరించింది. సిలికాన్‌ వేలీకి చెందిన వైకాంబినేటర్‌ తరహా యాక్సిలరేటర్‌గా దీన్ని రూపొందించినట్లు మెయిటీ ప్రత్యేక కార్యదర్శి జ్యోతి ఆరోరా తెలిపారు. ప్రస్తుతం కేంద్ర ఐటీ శాఖ మంత్రిగా అశ్విని వైష్ణవ్‌ ఉన్నారు.

సమృధ్‌ కార్యక్రమం–ముఖ్యాంశాలు
  • సమృధ్‌ కార్యక్రమానికి ఎంపికైన అంకుర సంస్థల్లో కనీసం 100 స్టార్టప్‌లను యూనికార్న్‌లుగా తీర్చిదిద్దడం లక్ష్యం.
  • సమృధ్‌ కింద స్టార్టప్‌లకు సీడ్‌ ఫండింగ్‌ రూపంలో నిధులపరమైన తోడ్పాటు, మార్గదర్శకత్వం, మార్కెట్లోకి విస్తరించేందుకు అవసరమైన నైపుణ్యాల్లో శిక్షణ మొదలైనవి లభిస్తాయి.
  • ఎంపికైన అంకుర సంస్థలకు ఈ పథకం కింద మెయిటీ రూ. 40 లక్షల దాకా సీడ్‌ ఫండ్, ఆరు నెలల పాటు మెంటార్‌షిప్‌ అందిస్తుంది.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : స్టార్టప్‌ యాక్సెలరేటర్‌ ఆఫ్‌ మెయిటీ ఫర్‌ ప్రోడక్ట్‌ ఇన్నోవేషన్, డెవలప్‌మెంట్‌ అండ్‌ గ్రోత్‌ (సమృధ్‌) కార్యక్రమం ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు 25
ఎవరు : కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ (మెయిటీ)
ఎక్కడ : దేశవ్యాప్తంగా...
ఎందుకు : దేశీయంగా 300 పైచిలుకు ఐటీ స్టార్టప్‌లకు తోడ్పాటు అందించేందుకు...
Published date : 26 Aug 2021 06:30PM

Photo Stories