Skip to main content

SC Commission Chairman: రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన న్యాయవాది?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌గా న్యాయవాది మారుమూడి విక్టర్‌ ప్రసాద్‌ ఆగస్టు 24న బాధ్యతలు స్వీకరించారు.
కృష్ణాజిల్లా మచిలీపట్నంకు చెందిన విక్టర్‌ దళితుల సమస్య లపై 30 ఏళ్లుగా అనేక ఉద్యమాలు చేశారు. మూడేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు కమిషన్లు ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెల్సిందే. 2020, జనవరిలో అసెంబ్లీ ఆమోదించిన బిల్లుకు 2021, జూలై 27న రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు.

కేంద్ర వాణిజ్య శాఖ జాయింట్‌ సెక్రటరీగా శ్రీకర్‌
2001 బ్యాచ్‌కు చెందిన ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌ అధికారి కె. శ్రీకర్‌ రెడ్డి కేంద్ర వాణిజ్య శాఖ సంయుక్త కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆయన నియామకానికి సంబంధించి వాణిజ్యశాఖ ప్రతిపాదనను కేంద్ర నియామక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఆమోదించింది. ఈ మేరకు ఆగస్టు 24న ఉత్తర్వులు జారీ అయ్యాయి.

క్విక్‌ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన న్యాయవాది?
ఎప్పుడు : ఆగస్టు 24
ఎవరు : మారుమూడి విక్టర్‌ ప్రసాద్‌
ఎందుకు : రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు...
Published date : 25 Aug 2021 06:54PM

Photo Stories