స్వీడన్ ప్రధాని సలహాదారుగా భారత సంతతి మహిళ
Sakshi Education
స్వీడన్ ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ)లో రాజకీయ సలహాదారురాలిగా భారత సంతతికి చెందిన మహిళ, మహారాష్ట్రకు చెందిన ప్రముఖ విద్యావేత్త అశోక్ విఖే పాటిల్ కుమార్తె నీలా విఖేపాటిల్ నియమితులయ్యారు.
స్వీడన్‌లో ఇటీవల అధికారం చేపట్టిన సోషల్ డెమోక్రాట్ గ్రీన్ పార్టీ కూటమి నాయకుడు స్టీఫెన్ లోవన్ వద్ద నీలా కొంతకాలంగా పనిచేస్తున్నారు. స్టీఫన్ 2019, జనవరిలో స్వీడన్ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన నీలను తన రాజకీయ సలహాదారురాలిగా ఫిబ్రవరి 6న నియమించుకున్నారు. గత ప్రభుత్వం హయాంలోనూ రాజకీయ సలహాదారురాలిగా పనిచేసిన నీలా స్టాక్‌హోం మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్‌ఎంసీ) సిటీ కౌన్సిల్‌కు ఎన్నికైంది. ఆర్థిక విభాగం, పన్నులు, బడ్జెట్, గృహనిర్మాణం వంటి విభాగాల బాధ్యతలను కూడా ఆమె నిర్వహించనున్నారు.
స్వీడన్‌లో జన్మించిన నీల గుజరాత్‌లోని అహ్మద్‌నగర్‌లో తన బాల్యాన్ని గడిపింది. స్వీడన్‌లోని గోతెన్‌బర్గ్ స్కూ ల్ ఆఫ్ బిజినెస్‌లో ఎంబీఏ డిగ్రీ చదివింది. నీల తాత బాలాసాహెబ్ విఖే పాటిల్ గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఇక ఆమె మేనమామ రాధాకృష్ణ విఖేపాటిల్ మహారాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : స్వీడన్ ప్రధాని సలహాదారుగా భారత సంతతి మహిళ
ఎప్పుడు : ఫిబ్రవరి 6
ఎవరు : నీలా విఖేపాటిల్

Published date : 07 Feb 2019 06:04PM