Skip to main content

స్వచ్ఛ దర్పణ్‌లో ఆరు తెలంగాణ జిల్లాలు

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ దర్పన్ మూడో దశ సర్వేలో తెలంగాణలోని ఆరు జిల్లాలు మొదటి స్థానంలో నిలిచాయి.
ఈ మేరకు స్వచ్ఛ దర్పణ్ ఫేస్- 3 ర్యాంకింగ్ వివరాలను కేంద్ర తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య శాఖ ఆగస్టు 17న విడుదల చేసింది. ఈ వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా మొత్తం 700 జిల్లాల్లో ఈ సర్వే నిర్వహించారు. అందులో 8 జిల్లాలకు మొదటి ర్యాంకు దక్కింది. వీటిలో తెలంగాణలోని వరంగల్ అర్బన్, జగిత్యాల, కామారెడ్డి, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలతో పాటు గుజరాత్‌లోని ద్వారక, హరియాణాలోని రేవరీ జిల్లాలకు జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు లభించింది.

స్వచ్ఛ దర్పణ్ ఫేస్- 3 ర్యాంకింగ్‌లలో తెలంగాణలోని 6 జిల్లాలు ప్రథమ స్థానంలో నిలవగా, మహబూబ్‌నగర్ 19, వనపర్తి జిల్లా 20 స్థానంతో సరిపెట్టుకున్నాయి. మిగతా జిల్లాల విషయానికొస్తే... ఖమ్మం-65, మేడ్చల్-75, జనగామ-86, గద్వాల-89, మంచిర్యాల-96, మెదక్-105, వరంగల్ రూరల్-108, సిద్దిపేట-143, నాగర్‌కర్నూల్-149, మిగతా జిల్లాలు 168 నుంచి 307 మధ్య ర్యాంకింగ్‌లు సాధించగా భూపాలపల్లి -530తో రాష్ట్రం నుంచి చివరిస్థానంలో నిలిచింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
స్వచ్ఛ దర్పణ్‌లో ఆరు తెలంగాణ జిల్లాలు
ఎప్పుడు : ఆగస్టు 17
ఎవరు : వరంగల్ అర్బన్, జగిత్యాల, కామారెడ్డి, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్
Published date : 19 Aug 2019 05:23PM

Photo Stories