షూటింగ్ వరల్డ్‌కప్‌లో భారత్‌కు మూడు స్వర్ణాలు
Sakshi Education
షూటింగ్ సీజన్ ముగింపు టోర్నీ ‘ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్ కప్ ఫైనల్స్’లో భారత్‌కు మూడు స్వర్ణ పతకాలు లభించాయి.
చైనాలోని పుతియాన్ నగరంలో నవంబర్ 21న జరిగిన జూనియర్ మహిళల 10మీ ఎయిర్ పిస్టల్ విభాగం ఫైనల్లో భారత షూటర్ మనూ భాకర్ 244.7 పాయింట్లతో ప్రపంచ రికార్డును నెలకొల్పడంతో పాటు స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. జొరానా అరునోవిచ్ (సెర్బియా-241.9) రజతం, క్వియాన్ వాంగ్ (చైనా-221.8) కాంస్యం దక్కించుకున్నారు.
మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత్‌కే చెందిన ఇలవనీల్ వలరివన్ పసిడి పతకం సాధించింది. ఫైనల్లో ఆమె 250.8 పాయింట్లు స్కోర్ చేసి అగ్రస్థానంలో నిలిచింది. లిన్ యింగ్ షిన్ (తైవాన్-250.7), లారా జార్జెటా కొమన్ (రొమేనియా-229) వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. మరోవైపు జూనియర్ పురుషుల 10మీ ఎయిర్ రైఫిల్ విభాగంలో 17 ఏళ్ల భారత యువ షూటర్ దివ్యాంశ్ 250.1 పాయింట్లతో స్వర్ణం గెలుచుకున్నాడు. ఇస్తవాన్ పెని(హంగేరీ-250) రజతం, పాట్రిక్ జానీ (స్లొవేకియా-228.4) కాంస్యం దక్కించుకున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్ కప్ ఫైనల్స్‌లో భారత్‌కు మూడు స్వర్ణాలు
ఎప్పుడు : నవంబర్ 21
ఎవరు : మనూ భాకర్, ఇలవనీల్ వలరివన్, దివ్యాంశ్
ఎక్కడ : పుతియాన్, చైనా

Published date : 22 Nov 2019 06:24PM