షూటింగ్ ప్రపంచ కప్ నుంచి వైదొలిగిన భారత్
Sakshi Education
సైప్రస్ వేదికగా 2020, మార్చి 4 నుంచి 13 వరకు జరిగే షూటింగ్ ప్రపంచ కప్ నుంచి భారత్ వైదొలిగింది.
కోవిడ్-19 విజృంభిస్తున్న నేపథ్యంలో భారత షూటర్ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు భారత జాతీయ రైఫిల్ సంఘం ఫిబ్రవరి 28న తెలిపింది. కోవిడ్-19 రోజు రోజుకు విస్తరిస్తున్న తరుణంలో భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొన్ని దేశాలకు భారతీయులు ప్రయాణం చేయకుండా ఉంటేనే మంచిదంటూ ఫిబ్రవరి 26న తెలిపింది. ఆ దేశాల జాబితాలో సైప్రస్ ఉండటంతో భారత షూటర్లు షూటింగ్ ప్రపంచ కప్ ఈవెంట్‌కు దూరమయ్యారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : షూటింగ్ ప్రపంచ కప్ నుంచి వైదొలిగిన భారత్
ఎప్పుడు : ఫిబ్రవరి 28
ఎక్కడ : సైప్రస్
ఎందుకు : కోవిడ్-19 విజృంభణ నేపథ్యంలో
క్విక్ రివ్యూ :
ఏమిటి : షూటింగ్ ప్రపంచ కప్ నుంచి వైదొలిగిన భారత్
ఎప్పుడు : ఫిబ్రవరి 28
ఎక్కడ : సైప్రస్
ఎందుకు : కోవిడ్-19 విజృంభణ నేపథ్యంలో
Published date : 29 Feb 2020 05:46PM