సూర్యుని కంటే 70 రెట్లు పెద్దదైన బ్లాక్‌హోల్
Sakshi Education
సూర్యుని కంటే దాదాపు 70 రెట్లు పెద్దదైన బ్లాక్‌హోల్(కృష్ణబిలం)ను చైనా శాస్త్రవేత్తలు గుర్తించారు.
చైనీస్ అకాడమీ ఆఫ్ సెన్సైస్‌కు చెందిన నేషనల్ ఆస్ట్రోన్రామికల్ అబ్జర్వేటరీ ఆఫ్ చైనా(ఎన్‌ఏఓసీ) శాస్త్రవేత్త, ప్రొఫెసర్ లియూ జీఫెంగ్ నేతృత్వంలోని బృందం ఈ బ్లాక్‌హోల్‌ను గుర్తించింది. మన పాలపుంతలోనే కనిపించిన ఈ భారీ బ్లాక్‌హోల్ భూమి నుంచి 15వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఈ బ్లాక్‌హోల్‌కు ఎల్‌బీ-1 అని నామకరణం చేశారు. ఈ సరికొత్త బ్లాక్‌హోల్‌ను మరింతగా అధ్యయనం చేయడం ద్వారా భూమి పుట్టుక, జీవ పరిణామ క్రమం గురించి మరిన్ని విశేషాలు తెలిసే అవకాశముందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఎల్‌బీ-1 సంబంధించిన పరిశోధన వివరాలు ‘జర్నల్ నేచర్’లో ప్రచురితమయ్యాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సూర్యుని కంటే 70 రెట్లు పెద్దదైన బ్లాక్‌హోల్ గుర్తింపు
ఎప్పుడు : నవంబర్ 28
ఎవరు : చైనీస్ అకాడమీ ఆఫ్ సెన్సైస్‌కు చెందిన నేషనల్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ ఆఫ్ చైనా(ఎన్‌ఏఓసీ) శాస్త్రవేత్తలు
ఎక్కడ : పాలపుంత
క్విక్ రివ్యూ :
ఏమిటి : సూర్యుని కంటే 70 రెట్లు పెద్దదైన బ్లాక్‌హోల్ గుర్తింపు
ఎప్పుడు : నవంబర్ 28
ఎవరు : చైనీస్ అకాడమీ ఆఫ్ సెన్సైస్‌కు చెందిన నేషనల్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ ఆఫ్ చైనా(ఎన్‌ఏఓసీ) శాస్త్రవేత్తలు
ఎక్కడ : పాలపుంత
Published date : 29 Nov 2019 05:45PM