Skip to main content

సూడాన్‌లో 101 మంది మృతి

సూడాన్ రాజధాని ఖర్టౌమ్‌లో మిలిటరీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టినవారిపై జరిపిన కాల్పుల్లో 101 మంది ప్రాణాలు కోల్పోయారు.
వంద మందికిపైగా గాయాలపాలయ్యారు. 101లో 40 మంది మృతదేహాలు నైలునదిలో లభించాయి. సూడాన్ అధ్యక్షుడు ఒమర్ అల్-బషీర్ నియంతృత్వ పాలనపై నెలల తరబడి ఆందోళనలు జరుగుతుండగా, ఆ దేశ మిలిటరీ2019, ఏప్రిల్‌లో బషీర్‌ను పదవి నుంచి దింపేసింది. మరో మూడేళ్లలో పౌర పాలన మళ్లీ మొదలయ్యేలా ఓ ఒప్పందం కుదిరింది. అప్పటివరకు దేశ పాలనకు మిలిటరీ కౌన్సిల్ ఏర్పాటైంది. ఈ కౌన్సిల్ పాలనను వ్యతిరేకిస్తూ అనేక మంది ఆర్మీ ప్రధాన కార్యాలయం బయట నిరసనలు తెలుపుతుండగా, వారిని అణచివేసేందుకు ఆర్మీ కాల్పులకు దిగింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
కాల్పుల్లో 101 మంది పౌరులు మృతి
ఎప్పుడు : జూన్ 5
ఎవరు : సుడాన్ ఆర్మీ
ఎక్కడ : ఖర్టౌమ్, సూడాన్
ఎందుకు : మిలిటరీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టినందుకు
Published date : 06 Jun 2019 05:38PM

Photo Stories