Skip to main content

స్టార్టప్ చాలెంజ్ చునౌతి కార్యక్రమం ప్రారంభం

Current Affairs
వినూత్నమైన ఆవిష్కరణలతో ముందుకు వచ్చే స్టార్టప్ సంస్థలకు నిధుల సాయం అందించేందుకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల శాఖ ‘చునౌతి’ పేరుతో ఓ కార్యక్రమాన్ని ప్రకటించింది. ప్రత్యేకంగా ద్వితీయ శ్రేణి పట్టణాల(టైర్-2)పై దృష్టి సారించే స్టార్టప్‌లు, సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులను ప్రోత్సహించే చునౌతి తదుపరి దశ స్టార్టప్ చాలెంజ్ పోటీని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆగస్టు 28న ప్రారంభించారు.

300 వరకు స్టార్టప్‌ల ఎంపిక...
చునౌతి కార్యక్రమం ద్వారా ఎంపిక చేసిన విభాగాల్లో పనిచేసే 300 వరకు స్టార్టప్‌లను ఎంపిక చేసి, ఒక్కోదానికి రూ.25 లక్షల వరకు నిధుల సాయంతోపాటు, ఇతర సౌకర్యాలను కల్పించనున్నారు.చునౌతి కార్యక్రమం కోసం ప్రభుత్వం మూడేళ్లలో రూ.95 కోట్లు ఖర్చు చేయనుంది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : స్టార్టప్ చాలెంజ్ చునౌతి కార్యక్రమం ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు 28
ఎవరు : కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్
ఎందుకు : వినూత్నమైన ఆవిష్కరణలతో ముందుకు వచ్చే స్టార్టప్ సంస్థలకు నిధుల సాయం అందించేందుకు
Published date : 29 Aug 2020 05:31PM

Photo Stories