Skip to main content

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చైర్మన్‌గా బి.ఆర్.శర్మ

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నూతన చైర్మన్‌గా బ్రజ్‌రాజ్ శర్మ నియమితులయ్యారు.
1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన శర్మ జమ్మూకశ్మీర్ కేడర్‌కు చెందినవారు. యూనివర్సిటీ ఆఫ్ జమ్మూలో పీజీ(పొలిటికల్ సైన్స్), ఆస్ట్రేలియన్ నేషనల్ వర్సిటీలో ఎంబీఏ చదివారు. జమ్మూకశ్మీర్ చీఫ్ సెక్రెటరీగా, హోం మంత్రిత్వశాఖ అదనపు సెక్రటరీగా(పోలీస్) సేవలందించారు. ప్రజలకు శర్మ అందించిన సేవలకు గాను జమ్మూకశ్మీర్ ప్రభుత్వం బంగారు పతకంతో (2011) సత్కరించింది. అలాగే ప్రధానమంత్రి ఎక్స్‌లెన్స్ మెడల్‌ను (2012)లో ఆయన అందుకున్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నూతన చైర్మన్‌గా నియామకం
ఎప్పుడు : అక్టోబర్ 23
ఎవరు : బ్రజ్‌రాజ్ శర్మ
Published date : 24 Oct 2019 05:37PM

Photo Stories