Skip to main content

స్టాంప్ చట్టంలో సవరణలకు రాష్ట్రపతి ఆమోదం

పన్నుల ఎగవేతను నిరోధించడంతో పాటు స్టాంప్ డ్యూటీ విధింపును క్రమబద్ధీకరించే సవరణలతో కూడిన ‘భారతీయ స్టాంపుల చట్టం 1899’కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింగ్ ఆమోదం తెలిపారు.
ఫైనాన్స్ చట్టం 2019లో భాగంగా భారతీయ స్టాంపుల చట్టం 1899కు సవరణలను ప్రభుత్వం చేయగా, దీనికి పార్లమెంటు కూడా ఆమోదం తెలిపింది. రాష్ట్రాలు సెక్యూరిటీ మార్కెట్ ఇనుస్ట్రుమెంట్లపై స్టాంప్ డ్యూటీ విధించుకునేందుకు వీలుగా వ్యవస్థాగత, చట్టబద్ధమైన యంత్రాగాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఇందులో ఉన్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. కొనుగోలు చేసిన క్లయింట్ల స్థిర నివాసం ఆధారంగా, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో స్టాంప్ డ్యూటీని సరిగ్గా పంచుకునే యంత్రాంగాన్ని ప్రతిపాదించారు. రాష్ట్రపతి ప్రత్యేక ఆదేశాల మేరకు ఆర్టికల్ 263 కింద సమన్వయ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదించినట్టు ఆర్థిక శాఖ తెలిపింది. ఈ కౌన్సిల్‌లో కేంద్ర, రాష్ట్రాల ప్రతినిధులు ఉంటారు. స్టాంప్ డ్యూటీ చార్జీల సమీక్ష, సవరణపై సూచనలు చేయడం ఈ కౌన్సిల్ బాధ్యత. ఈక్విటీ మార్కెట్లు, ఈక్విటీ సంస్కృతి దేశవ్యాప్తంగా మరింత అభివృద్ధి చెందేందుకు ఇది దారితీస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
స్టాంప్ చట్టంలో సవరణలకు రాష్ట్రపతి ఆమోదం
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింగ్
ఎందుకు : పన్నుల ఎగవేతను నిరోధించడంతో పాటు స్టాంప్ డ్యూటీ విధింపును
Published date : 22 Feb 2019 05:12PM

Photo Stories