Skip to main content

స్టాండింగ్ కమిటీలో సీఎం వైఎస్ జగన్

రాష్ట్రాల మధ్య తలెత్తే వివాదాల దర్యాప్తు, సలహాల కోసం ఉద్దేశించిన అంతర్రాష్ట్ర మండలి స్టాండింగ్ కమిటీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి చోటు లభించింది.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షుడిగా ఉండే 13 మందితో కూడిన స్టాండింగ్ కమిటీకి తాజాగా నలుగురు ముఖ్యమంత్రులు నామినేట్ అయ్యారు. వారిలో నవీన్‌పట్నాయక్ (ఒడిశా), నితీశ్‌కుమార్ (బిహార్), అమరేందర్ సింగ్ (పంజాబ్)లతో పాటుగా ఏపీ సీఎం వైఎస్ జగన్ ఉన్నారు.

అంతర్రాష్ట్ర మండలి స్టాండింగ్ కమిటీ
అధ్యక్షుడు :
కేంద్ర హోం మంత్రి అమిత్ షా
సభ్యులు :
  1. నవీన్‌పట్నాయక్ (ఒడిశా సీఎం)
  2. నితీశ్‌కుమార్ (బిహార్ సీఎం)
  3. అమరేందర్ సింగ్ (పంజాబ్ సీఎం)
  4. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి(ఆంధ్రప్రదేశ్ సీఎం)
  5. శర్బానంద్ సోనోవాల్ (అసోం సీఎం)
  6. విజయ్ రూపాణీ (గుజరాత్ సీఎం)
  7. దేవేంద్ర ఫడ్నవిస్ (మహారాష్ట్ర సీఎం)
  8. యోగి ఆదిత్యనాథ్ (ఉత్తర ప్రదేశ్ సీఎం)
  9. నిర్మలా సీతారామన్ (కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి)
  10. నరేంద్ర సింగ్ తోమర్ (కేంద్ర వ్యవసాయం, రైతుల సంక్షేమ శాఖ మంత్రి)
  11. తావర్ చంద్ గెహ్లోత్ (కేంద్ర సామజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి)
  12. గజేంద్రసింగ్ షెకావత్ (కేంద్ర జలశక్తి శాఖ మంత్రి)

క్విక్ రివ్యూ :
ఏమిటి :
అంతర్రాష్ట్ర మండలి స్టాండింగ్ కమిటీలో చోటు
ఎప్పుడు : ఆగస్టు 16
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
Published date : 17 Aug 2019 05:25PM

Photo Stories