శ్రీలంకలో మారణహోమం
Sakshi Education
క్రెస్తవులకు ప్రధానమైన ఈస్టర్ పండుగనాడు ద్వీపదేశం శ్రీలంకలో నరహంతకులు మారణహోమం సృష్టించారు.
రాజధాని కొలంబోతోపాటు నెగొంబో, బట్టికలోవా పట్టణాల్లో బాంబుల మోత మోగించారు. చర్చిలు, విలాసవంతమైన హోటళ్లు లక్ష్యంగా దాడులకు తెగబడ్డారు. ఏప్రిల్ 21న జరిగిన మొత్తం 8 వరుస పేలుళ్లలో 215మంది(ఏప్రిల్ 21నాటికి) అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మరో 500 మందికిపైగా గాయపడ్డారు. ఈ పేలుళ్లలో మొత్తం 33 మంది విదేశీయులు మరణించగా వారిలో ముగ్గురు భారతీయులు ఉన్నారు. మిగిలిన 21 మంది విదేశీయుల మృతదేహాలను గుర్తించేపనిలో ఉన్నామని శ్రీలంక అధికారులు వెల్లడించారు.
ఈస్టర్ సందర్భంగా చర్చిల్లో సామూహికంగా ప్రార్థనలు చేసుకుంటుండగా ఈ పేలుళ్లు సంభవించాయి. మొత్తం 3 చర్చిలు, మూడు హోటళ్లు, జూ వద్ద, మరో ఇంట్లో దుండగులు పేలుళ్లకు పాల్పడ్డారు. కొలంబోలోని కింగ్‌సబరీ హోటల్, సెయింట్ ఆంథోని చర్‌చ, డెమాటగోడ కాంప్లెక్స్, సినమన్ గ్రాండ్, షాంగ్రి- లా హోటల్, ట్రాపికల్ ఇన్‌లలో దాడులు జరిగాయి. అలాగే నెగొంబోలోని సెయింట్ సెబాస్టియన్స్ చర్‌చలో, బట్టికలావోలోని జియోన్ చర్‌చలో ఉగ్రవాదులు పేలుళ్లు జరిపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : శ్రీలంకలో మారణహోమం
ఎప్పుడు : ఏప్రిల్ 21
ఎక్కడ : కొలంబో, నెగొంబో, బట్టికలోవా

Published date : 22 Apr 2019 06:08PM