శ్రీలంక పేలుళ్లు తామే చేశాం : ఐసిస్
Sakshi Education
శ్రీలంకను వణికించిన వరుస పేలుళ్లకు తామే పాల్పడ్డామని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ప్రకటించింది.
కొలంబోలో ఏప్రిల్ 21న జరిగిన వరుస పేలుళ్లలో 321 మంది మరణించగా, దాదాపు 500 మంది గాయపడ్డారు. వీరిలో 10 మంది భారతీయులు ఉన్నారు. ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల సంఖ్య 45 అని యూనిసెఫ్ వెల్లడించింది. మరోవైపు శ్రీలంక ప్రభుత్వ అధికార ప్రతినిధి, ఆరోగ్య మంత్రి రజిత సేనరత్నే మాట్లాడుతూ స్థానిక ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ నేషనల్ తౌహీద్ జమాత్ ఈ దాడులకు కుట్రపన్నినట్లు అనుమానాలు ఉన్నాయని తెలిపారు. ఆత్మాహుతి దాడులకు పాల్పడిన వారందరూ శ్రీలంక జాతీయులేననీ, వారికి ఐసిస్ లేదా ఏదేనీ ఇతర విదేశీ ఉగ్రవాద సంస్థ మద్దతు ఇచ్చి ఉండొచ్చన్నారు.
మసీదుపై దాడికి ప్రతీకారంగానే
2019, మార్చి 15న న్యూజిలాండ్‌లో మసీదుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి 50 మంది మృతికి కారణమవ్వడం తెలిసిందే. ఆ దాడికి ప్రతీకారంగానే స్థానిక ఇస్లాం తీవ్రవాదులు శ్రీలంకలో ఈస్టర్ నాడు బాంబు దాడులు చేశారని శ్రీలంక రక్షణ శాఖ సహాయ మంత్రి రువాన్ విజెవర్ధనే వెల్లడించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : శ్రీలంక దాడికి బాధ్యత ప్రకటించుకున్న ఉగ్రసంస్థ
ఎప్పుడు : ఏప్రిల్ 23
ఎవరు : ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్)

Published date : 24 Apr 2019 05:18PM