Skip to main content

శ్రీలంక ఆర్మీచీఫ్ షవేంద్ర సిల్వపై అమెరికా నిషేధం

శ్రీలంక ఆర్మీ చీఫ్ షవేంద్ర సిల్వతో పాటు అతడి కుటుంబ సభ్యులపై అమెరికా ప్రభుత్వం నిషేధం విధించింది.
Current Affairsసిల్వను అమెరికాలోకి అనుమతించబోమని ఆ దేశ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో చెప్పారు. 2009 అంతర్యుద్ధంలో భారీగా మానవహక్కుల ఉల్లంఘనలకు అతడు పాల్పడినట్లు తమ వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయన్నారు. ఆయా ఆధారాలను ఐక్యరాజ్యసమితి సహా పలు సంస్థలు కూడా గుర్తించాయని పాంపియో పేర్కొన్నారు. శాంతిని, మానవ హక్కులను పెంపొందించాలంటూ శ్రీలంక ప్రభుత్వానికి అమెరికా సూచించింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
శ్రీలంక ఆర్మీ చీఫ్ షవేంద్ర సిల్వపై నిషేధం
ఎప్పుడు : ఫిబ్రవరి 14
ఎవరు : అమెరికా
ఎందుకు : మానవహక్కుల ఉల్లంఘనలకు పాల్పడ్డారని
Published date : 15 Feb 2020 05:52PM

Photo Stories