శ్రీ సిటీలో జ్ఞాన్ సర్కిల్ వెంచర్స్ ప్రారంభించిన కేంద్ర మంత్రి
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా శ్రీ సిటీలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ట్రిపుల్ ఐటీ)కి చెందిన బిజినెస్ ఇంక్యుబేటర్ జ్ఞాన్ సర్కిల్ వెంచర్స్‌ను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అక్టోబర్ 8న ప్రారంభించారు.
కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ ఆర్థిక సహాయంతో ఇది ఏర్పాటైంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ఆవిష్కరణలతోనే దేశం పురోగతి వైపు పయనిస్తుందని పేర్కొన్నారు. జ్ఞాన్ సర్కిల్ వెంచర్స్.. పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, మార్గదర్శకత్వం ద్వారా ఆవిష్కరణ, స్టార్టప్‌లకు ఊతమిస్తుందని వివరించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : శ్రీ సిటీలోని ట్రిపుల్ ఐటీ బిజినెస్ ఇంక్యుబేటర్ జ్ఞాన్ సర్కిల్ వెంచర్స్ ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 8
ఎవరు : కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్
ఎక్కడ : శ్రీ సిటీ, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్

Published date : 09 Oct 2020 05:37PM