Skip to main content

సరిహద్దుల చరిత్రకు రాజ్‌నాథ్ ఆమోదం

దేశ సరిహద్దుల చరిత్రను లిఖితరూపంలోకి తెచ్చేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆమోదం తెలిపారని సెప్టెంబర్ 18న రక్షణ శాఖ వెల్లడించింది.
భారత చారిత్రక పరిశోధన మండలి, జనరల్ ఆఫ్ ఆర్కైవ్‌‌స డెరైక్టరేట్ జనరల్, దేశ, విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధులతో సమావేశమై రాజ్‌నాథ్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపింది. రెండేళ్లలోగా ఈ ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఈ ప్రాజెక్టులో భాగంగా చరిత్రను అధ్యయనం చేయడం, సరిహద్దుల మార్పులు, భద్రతా బలగాల ప్రాముఖ్యత, ఆ ప్రాంత ప్రజల సామాజిక-ఆర్థిక అంశాలను పరిగణనలోకి తీసుకోనున్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
దేశ సరిహద్దుల చరిత్ర ప్రాజెక్టుకు ఆమోదం
ఎప్పుడు : సెప్టెంబర్ 18
ఎవరు : రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
ఎందుకు : దేశ సరిహద్దుల చరిత్రను లిఖితరూపంలోకి తెచ్చేందుకు
Published date : 19 Sep 2019 05:26PM

Photo Stories